News January 8, 2026
BRAEKING: బాంబు బెదిరింపు.. విశాఖ జిల్లా కోర్టులో తనిఖీలు

విశాఖ జిల్లా కోర్టుల వాణిజ్య సముదాయంలో భద్రతా సిబ్బంది గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టు మెయిల్‌కు బాంబు పెట్టినట్లుగా సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా సమాచారం. తనిఖీల్లో ఎక్కడా బాంబు సామగ్రి దొరకలేదు. పార్కింగ్ స్థలాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు.
Similar News
News January 10, 2026
వనపర్తి: 6 నెలల్లోపు వాహనాలు తీసుకెళ్లాలి.. లేదంటే వేలం!

వనపర్తి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న 130 అబాండెడ్ (వదిలివేసిన) వాహనాలను 6నెలల్లోపు యజమానులు తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి సూచించారు. లేనిపక్షంలో పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 26ప్రకారం వీటిని బహిరంగ వేలం వేస్తామని హెచ్చరించారు. సరైన పత్రాలతో తమవాహనాలను క్లెయిమ్ చేసుకోవాలని తెలిపారు. చట్టపరమైన గడువు ముగిసిన తర్వాత ఆ వాహనాలను ప్రభుత్వ ఆస్తిగా పరిగణించి వేలం నిర్వహిస్తామన్నారు.
News January 10, 2026
జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కు నిర్మల్ జిల్లా విద్యార్థులు

కామారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో నిర్మల్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. భైంసాలోని ఓ పాఠశాల విద్యార్థి అర్ణవ్ రూపొందించిన ‘స్మార్ట్ వీల్ చైర్’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. మరో ఇద్దరు విద్యార్థుల ప్రదర్శనలు సౌత్ ఇండియా స్థాయికి ఎంపికయ్యారు. జిల్లా చరిత్రలో ఒకేసారి ముగ్గురు జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. DEO దర్శనం భోజన్న శనివారం అభినందించారు.
News January 10, 2026
మార్స్‌కైనా వెళ్లాల్సిందే: బంగ్లా క్రికెటర్

భారత్‌తో సంబంధాలు దెబ్బతినడంతో మన దేశంలో T20WC ఆడేందుకు <<18807855>>BCB <<>>నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై వరల్డ్ కప్ కోసం ఎంపికైన బంగ్లా ఆల్రౌండర్ మహెదీ హసన్ స్పందించారు. ‘అనిశ్చితి అనేది మేనేజ్మెంట్ సమస్య. దానిని అఫీషియల్స్ డీల్ చేయాల్సి ఉంటుంది. మా పని క్రికెట్ ఆడటం మాత్రమే. మీరు ఆటగాళ్లను మార్స్‌కు పంపినా వెళ్లి ఆడతారు. దానిపై వారికి ఎలాంటి అభ్యంతరం ఉండదు’ అని వ్యాఖ్యానించారు.


