News September 27, 2024
అగ్నివీర్‌లకు శుభవార్త చెప్పిన బ్రహ్మోస్ ఏరోస్పేస్
కనీసం 15% టెక్నికల్ ఖాళీలను అగ్నివీర్‌లకు రిజర్వ్ చేస్తున్నట్టు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. అలాగే, ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాలు, అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ విభాగాల్లో 50% ఖాళీలను వీరి ద్వారా భర్తీ చేయనుంది. సాయుధ దళాలలో 4 ఏళ్ల సేవ తర్వాత అగ్నివీర్‌లు తమ తమ రంగాలలో నైపుణ్యంతో పాటు లోతైన క్రమశిక్షణ, జాతీయవాదాన్ని పెంపొందించుకుంటారని సంస్థ డిప్యూటీ CEO Dr. సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Similar News
News December 30, 2024
ఉక్రెయిన్‌కి భారీ సైనిక సాయం ప్రకటించిన బైడెన్
రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ 2.5 బిలియన్ డాలర్ల భారీ సైనిక సాయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యానికి అవసరమైన తక్షణ సామాగ్రిని అందించేందుకు 1.25 బిలియన్ డాలర్ల డ్రాడౌన్ ప్యాకేజీ, 1.22 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల సరఫరాకు ఆమోదం తెలిపారు. రష్యాను నిలువరించే ప్రయత్నాల్లో ఉక్రెయిన్‌కు అండగా ఉండడం తన ప్రాధాన్యమని బైడెన్ పేర్కొన్నారు.
News December 30, 2024
9 కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
AP: బీపీసీఎల్, టీసీఎస్ సహా 9 కొత్త ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. SIBP సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘క్లీన్ ఎనర్జీ పాలసీకి భారీ స్పందన లభిస్తోంది. కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి’ అని పేర్కొన్నారు.
News December 30, 2024
ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?
AP: సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.