News May 5, 2024
ఈ నెల 21 నుంచి ఢిల్లీలో బ్రహ్మోత్సవాలు

ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి 29 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 14న ఆలయ శుద్ధి, 20న సాయంత్రం అంకురార్పణ, 21న ఉదయం 10.45 నుంచి 11.30 గంటల మధ్యలో కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం జరుగుతాయి. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉదయం 8గంటల నుంచి 9 గంటల మధ్యలో, రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్యలో వాహన సేవలు జరుగుతాయని టీటీడీ వర్గాలు తెలిపాయి. 30న సాయంత్రం పుష్పయాగం చేస్తారు.
Similar News
News February 3, 2026
‘భోలే బాబా’ను తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి: సత్యకుమార్

AP: పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసేలా రూల్స్ మార్చి YCP బరి తెగించిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘TTD నెయ్యి కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదని YCP అంటోంది. అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? కల్తీ అయిందని జగన్ హయాంలో CFTRI తేల్చినా పట్టించుకోలేదు. భోలేబాబా డెయిరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి.’ అని పేర్కొన్నారు. CMగా జగన్ అన్యమతస్థులను TTDలో నియమించారని విమర్శించారు.
News February 3, 2026
మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ(<
News February 3, 2026
మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

మైతేయి, కుకీ జాతుల మధ్య హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్ రాష్ట్రానికి కొత్త CM ఖరారయ్యారు. BJP సీనియర్ నేత, మాజీ స్పీకర్ యుమ్నాం ఖేంచంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఆ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. శాంతి భద్రతల పునరుద్ధరణ, జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడం వంటి సవాళ్లు ఎదుర్కోనున్నారు.


