News April 4, 2024
19 నుంచి ఇంద్రకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 22వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణం నిర్వహిస్తారు. 24న పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 19న వెండి పల్లకీ సేవ, 20న రావణ వాహన సేవ, 21న వెండి రథోత్సవం, 22న నంది వాహన సేవ, 23న సింహ వాహన సేవలో ఆది దంపతులు భక్తులకు దర్శనమిస్తారు.
Similar News
News January 1, 2026
వంటింటి చిట్కాలు

* బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే, చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని వాటికి రుద్దాలి.
* గోధుమ పిండి, శెనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాలో బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి.
* కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.
* తీపి పదార్థాలు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు వేయడం మరవకండి. పదార్థాలు మంచి రుచిగా ఉంటాయి.
News January 1, 2026
BEMLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News January 1, 2026
కోతితో సినిమా చేస్తున్న మురుగదాస్!

స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ AR మురుగదాస్ ఇటీవల వరుస ఫ్లాప్‌లను చూశారు. రజనీకాంత్‌తో ‘దర్బార్’, సల్మాన్‌తో ‘సికిందర్’, శివకార్తికేయన్‌తో ‘మదరాసి’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యారు. తన నెక్స్ట్ సినిమాలో కోతిని లీడ్ రోల్‌గా చూపించనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ పూర్తిగా పిల్లల కోసం ఉంటుందని తెలిపారు. దీనిని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.


