News August 14, 2025
తెర వెనుక పొత్తులకు బ్రాండ్ జగనే: షర్మిల

AP: మాజీ సీఎం జగన్‌ది నీతిమాలిన చరిత్ర అని పీసీసీ స్టేట్ చీఫ్ షర్మిల విమర్శించారు. తెర వెనుక పొత్తులకు ఆయన ఓ పెద్ద బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. ‘మోదీకి జగన్ వంగి వంగి దండాలు పెట్టారు. పార్లమెంట్‌లో ఆ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చారు. మోదీ, అమిత్ షాతో హాట్ లైన్ టచ్‌లో ఉన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే విమర్శలు చేస్తారా? మీదో పార్టీ.. మీరొక నాయకుడు’ అని ఆమె ఫైర్ అయ్యారు.
Similar News
News August 15, 2025
శనివారం వరకు వేటకు వెళ్లరాదు: APSDMA

AP: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అటు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని వివరించింది.
News August 15, 2025
పులివెందులలో వైసీపీకి 8% ఓట్లా?: రోజా

AP: గత ఎన్నికల్లో పులివెందుల పరిధిలో YCP 64% ఓట్లు సాధించిందని, ఇప్పుడు 8.95% ఓట్లు రావడమేంటని ఆ పార్టీ నేత రోజా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 24% ఓట్లు వచ్చిన TDPకి ఇప్పుడు 88% ఓట్లు రావడమేంటని మండిపడ్డారు. ‘ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం ఏమిటో? పోటీలో ఉన్న అభ్యర్థికి వారి కుటుంబసభ్యులు అయినా ఓటు వేయరా? ఈ ఫలితాలను మనం నమ్మాలా?’ అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు.
News August 15, 2025
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, భద్రాద్రి, జనగామ, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంది.