News July 24, 2024
బ్రాండ్ మద్యాన్ని కనుమరుగు చేశారు: చంద్రబాబు

AP: దేశమంతా దొరికే బ్రాండ్ మద్యం ఏపీలో దొరక్కుండా గత YCP ప్రభుత్వం చేసిందని CM చంద్రబాబు దుయ్యబట్టారు. ‘వాళ్లు అనుమతించిన బ్రాండే మద్యం షాపులో దొరుకుతుంది. MNC బ్రాండ్లన్నీ కనుమరుగయ్యేలా చేశారు. మాన్యుఫాక్చరింగ్ యూనిట్లన్నీ YCP నేతల చేతుల్లోకి వెళ్లాయి. కొత్తగా 26 కంపెనీలు, 38 రకాల లోకల్ బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు’ అని అసెంబ్లీలో విమర్శించారు.
Similar News
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధమ్|
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికమ్|
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజమ్||
పూర్తి స్తోత్రం కోసం <
News December 10, 2025
IISERBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( <
News December 10, 2025
పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం

AP: దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.


