News January 3, 2025

బ్రాండ్లకు పేరు సాయం.. 2024లో రూ.308 కోట్లు ఆదాయం!

image

బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసి కొందరు సెలబ్రెటీలు రూ.కోట్లు సంపాదిస్తుంటారు. యాక్టర్లు, క్రికెటర్లతో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులు ఇందులో ముందుంటారు. అయితే, మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హామ్ 2024 ఏడాదిలో కొన్ని బ్రాండ్లకు తన పేరును వాడుకునే హక్కు ఇవ్వడం ద్వారా $36 మిలియన్లు (రూ.308 కోట్లు) సంపాదించారు. ఆయనతో జతకట్టిన కంపెనీలు లాభాలు పొందడమే కాక బెక్హామ్ ఆదాయాన్ని భారీగా పెంచేశాయి.

Similar News

News December 3, 2025

భద్రాచలం- కొవ్వూరు రైల్వే‌లైన్ పూర్తి చేయాలి.!

image

భద్రాచలం- కొవ్వూరు రైల్వే‌లైన్ పనులను త్వరగా చేపట్టాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్‌కు సంబంధించి వివరాలు తెలిపారు. పనులు వెంటనే మొదలుపెట్టే విధంగా రైల్వే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఒక లేఖను కేంద్ర మంత్రికి అందించారు.

News December 3, 2025

రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం

image

ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. 359 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆ జట్టులో మార్క్రమ్ (110) టాప్ స్కోరర్. IND బౌలర్లలో అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు తీయగా, హర్షిత్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. SA విజయంతో 3 మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే ఈ నెల 6న వైజాగ్‌లో జరగనుంది.

News December 3, 2025

TG హైకోర్టు న్యూస్

image

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా