News January 17, 2025

BRAOUలో ట్యూషన్ ఫీజుకు చివరితేదీ జనవరి 25

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సార్వతిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, 2nd, 3rd ఇయర్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ జనవరి 25 అని విద్యార్థి సేవల విభాగాల అధిపతి డా.వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్ పొంది సకాలంలో ఫీజు చెల్లించలేకపోయినవారు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు. సందేహాలుంటే 040-236080222 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు.

Similar News

News February 16, 2025

HYD: NIRDలో జాబ్స్.. నెలకు రూ. 2,50,000 జీతం

image

HYD రాజేంద్రనగర్‌లోని NIRDలో కాంట్రాక్ట్ బేసిక్ కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ 02, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 9 పోస్టులు ఉన్నాయి. PG, PHD చేసి అనుభవం ఉన్నవారు అర్హులు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,20,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ. 2,50,000 వేతనం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు నేడు చివరి రోజు.
LINK: http://career.nirdpr.in/
SHARE IT

News February 15, 2025

HYD: గచ్చిబౌలిలో అవినీతి అధికారి.. రూ. 100 కోట్లు!

image

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన గచ్చిబౌలి ADE సతీశ్ కుమార్ ఇంట్లో ACB సోదాలు ముగిశాయి. శుక్రవారం రూ.50 వేలు తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డాడు. సోదాలు చేపట్టిన ACB ఏకంగా రూ. 100 కోట్ల వరకు స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు అంచనా వేశారు. రెండు రోజులపాటు సోదాలు జరిపి ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించారు. HYD, RR, కరీంనగర్‌లో స్థలాలు, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. సతీశ్‌ను రిమాండ్‌కు తరలించారు.

News February 15, 2025

ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

image

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.

error: Content is protected !!