News March 13, 2025
BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.
Similar News
News April 5, 2026
బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దంతాల ఆరోగ్యం కోసం రోజూ రెండు సార్లు బ్రష్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ వాడాలి. గట్టిగా ఉండేవి వాడితే దంతాలపై ఎనామెల్ పొరను అరిగిపోయేలా చేస్తాయి. కనీసం 2min నోటిలోని అన్ని వైపులా తోమాలి. నాలుకను క్లీన్ చేసుకోవాలి. తిన్న తర్వాత బ్రష్ చేయాలనుకుంటే వెంటనే చేయవద్దు. 30-60min తర్వాతే చేయాలి. 3 నెలలకోసారి బ్రష్‌ను మార్చాలి’ అని సూచిస్తున్నారు.
News April 5, 2026
HYDలో IPL మ్యాచ్.. నేడు డబుల్ ధమాకా

IPLలో నేడు 2 మ్యాచులు జరగనున్నాయి. 3.30PMకి హైదరాబాద్ వేదికగా SRH, LSG తలపడనున్నాయి. 7.30PMకి బెంగళూరులో CSK, RCB మ్యాచ్ జరగనుంది. HYD పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందని, భారీ స్కోర్ నమోదయ్యే అవకాశముందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అటు బెంగళూరు పిచ్ పేసర్లకు హెల్ప్ అవుతుందని, 200 రన్స్ చేస్తే మంచి స్కోర్ అవుతుందని అంచనా. ఈరోజు LSG, CSK బోణీ కొడతాయా లేదా SRH, RCB మరో విక్టరీ సాధిస్తాయో చూడాలి.
News April 5, 2026
సిద్దిపేట: మెగా జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ చేసుకోండి

సిద్దిపేట జిల్లా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో “సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర” పేరుతో ఒక భారీ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఈ ముందడుగు కార్యక్రమం ద్వారా జిల్లాలోని అర్హులైన యువతీ యువకులకు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. Q ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషచేసుకోవాలన్నారు.


