News October 25, 2024

BREAKING: అమోయ్ కుమార్‌పై మరో ఫిర్యాదు

image

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌పై మరో భూకుంభకోణంపై ఫిర్యాదు నమోదైంది. దాదాపు రూ.1,000 కోట్ల విలువ చేసే భూమిని అమోయ్ కుమార్ మాయం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం గ్రామంలోని మధురానగర్ కాలనీ ఫ్లాట్స్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు.

Similar News

News March 1, 2026

RR: డ్వాక్రా మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

image

హెల్త్ మిషన్-100లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని డ్వాక్రా మహిళలందరికీ 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయబోతున్నామని DMHO డా.లలితాదేవి అన్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 2,25,020 మంది మహిళా సభ్యుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నామని ఆమె పేర్కొన్నారు.

News February 28, 2026

రంగారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పద్మావతి తీర్పునిచ్చినట్లు ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు. 2019లో 17ఏళ్ల బాలికను సైదాబాదాద్‌కు చెందిన బ్యాగరి సంతోష్ (26) ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది.

News February 26, 2026

HYD: విద్యార్థులకు టెలి మనస్ సేవలు

image

TGBIE ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. పరీక్షల్లో ఒత్తిడి, భయం, నిరుత్సాహాన్ని ఎదుర్కొనే విద్యార్థులు మౌనం వహించకుండా తమ సమస్యలను పంచుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందడం తప్పు కాదని పేర్కొన్నారు. మానసిక సహాయం కోసం టెలీ మానస్ హెల్ప్‌లైన్ 14416లో సంప్రదించాలని BIE ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ వెల్లడించారు.