News October 25, 2024
BREAKING: ఆదిలాబాద్ MLA కారుకు ప్రమాదం

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కారుకు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తుండగా వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయింది. కాగా ఎమ్మెల్యే అతి స్వల్పంగా గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News December 17, 2025
గుడిహత్నూర్: స్కూటీపై వచ్చి ఓటేసిన 85 ఏళ్ల బామ్మ

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ 85 ఏళ్ల బామ్మ ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటుకున్నారు. వయసు భారంతో ఉన్న శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా, ఆమె స్వయంగా స్కూటీపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్ఫూర్తిని చూసి స్థానికులు, ఎన్నికల సిబ్బంది అభినందనలు తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యంపై ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారని అధికారులు పేర్కొన్నారు.
News December 17, 2025
ఆదిలాబాద్: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. 100 మీటర్లు, 200 మీటర్ల దూరంలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని తప్పక పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు వంటి వాటికి అనుమతి లేదన్నారు. క్యూ లైన్ పద్ధతి పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.
News December 17, 2025
ఆదిలాబాద్: సమస్యలు సృష్టించే 756 మంది బైండోవర్

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గొడవలు సృష్టించే అవకాశం ఉన్న 756 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను కూడా సేఫ్ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మూడు విడతల బందోబస్తులో ఫారెస్ట్, టీజీఎస్పీ, ఏసీటీపీసీ సిబ్బంది పాల్గొంటున్నారని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.


