News September 25, 2024
BREAKING: ఆపరేషన్ మూసీ.. అక్రమ నిర్మాణాల గుర్తింపు

మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నది వద్ద ఇళ్లు కట్టుకున్న వారిని తరలించేందుకు రెడీ అయ్యారు. మూసీ గర్భంలో 2,166 నిర్మాణాలను అధికారులు గుర్తించగా ఇందులో HYDలో 1,595, రంగారెడ్డిలో332, మేడ్చల్‌లో 239 ఉన్నాయి. మూసీలో ప్రైవేట్ వ్యక్తులవి 16వేల నిర్మాణాలున్నాయి. కాగా పునరావాసం కింద నిర్వాసితులకు 15వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని అధికారి దానకిశోర్ తెలిపారు.
Similar News
News October 18, 2025
HYD: జిమ్‌లలో ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ దుర్వినియోగంపై చర్యలు

సికింద్రాబాద్‌లోని నామాలగుండులో అక్రమంగా నిల్వచేసి విక్రయించిన ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ నిల్వలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎం.నరేశ్ అనే మెడికల్ వ్యాపారి నుంచి గుండె ఉద్దీపన మందులు-టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీబిల్డింగ్‌లో దుర్వినియోగం కోసం ఈ మందులను జిమ్‌కు వెళ్లేవారికి చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారు.
News October 18, 2025
HYD: నవీన్ యాదవ్ ఆస్తులు రూ.29.66 కోట్లు

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నామినేషన్‌తోపాటు తన అఫిడవిట్ దాఖలు చేశారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు, రూ.5.75 కోట్లు భార్య పేరిట ఉన్నాయన్నారు. తనకు అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. తనపై 7 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా వెల్లడించారు. 18.69 ఎకరాల వ్యవసాయ భూమి, యూసుఫ్‌గూడలో 860 గజాల ఇంటి స్థలం ఉందన్నారు.
News October 18, 2025
HYD: సంపులో పడి చిన్నారి మృతి.. జర జాగ్రత్త..!

HYD నానక్ రాంగూడలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీఎన్జఓ కాలనీలో ఉండే పరమేశ్వర్, సంధ్యారాణి దంపతులకు కుమారుడు నిఖిల్ తేజ(4) ఉన్నాడు. ఈ క్రమంలో అంగన్వాడికి వెళ్లిన నిఖిల్ పక్కనే ఉన్న సంపులో ఆడుతూ పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కొద్దిసేపు తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో సంపులో మృతదేహం లభించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.