News September 25, 2024
BREAKING: ఆపరేషన్ మూసీ.. అక్రమ నిర్మాణాల గుర్తింపు
మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నది వద్ద ఇళ్లు కట్టుకున్న వారిని తరలించేందుకు రెడీ అయ్యారు. మూసీ గర్భంలో 2,166 నిర్మాణాలను అధికారులు గుర్తించగా ఇందులో HYDలో 1,595, రంగారెడ్డిలో332, మేడ్చల్‌లో 239 ఉన్నాయి. మూసీలో ప్రైవేట్ వ్యక్తులవి 16వేల నిర్మాణాలున్నాయి. కాగా పునరావాసం కింద నిర్వాసితులకు 15వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని అధికారి దానకిశోర్ తెలిపారు.
Similar News
News October 9, 2024
HYD: దసరా.. ఊరెళ్లేవారికి ఛార్జీల మోత!
బతుకమ్మ నేపథ్యంలో TGRTC ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే స్పెషల్ బస్సుల్లో దాదాపు 25 శాతం అధికంగా ఉన్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. పండుగ వేళ తమ జేబులకు చిల్లు పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఉప్పల్ అధికారులను వివరణ కోరగా.. కేవలం స్పెషల్ బస్సులకే మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయన్నారు.
News October 9, 2024
RR: జనాభా ఆధారంగా పంచాయతీలకు నిధులు
RR, MDCL, VKB జిల్లాలలో గ్రామ పంచాయతీలకు ఇటీవలే నిధులు విడుదల చేశారు. 3 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 వేలు, 3వేల నుంచి 8వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.75 వేలు, 8వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరిగినట్లు తెలిపారు.
News October 9, 2024
బతుకమ్మ: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్!
సద్దుల బతుకమ్మ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి ట్యాంక్‌బండ్‌కు తీసుకొస్తారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు బాగ్‌లింగంపల్లి, KPHB, సరూర్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లోని GHMC మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు బతుకమ్మ పాటలతో హైదరాబాద్ హోరెత్తనుంది.