News March 30, 2025
BREAKING: ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐల బదిలీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఆదివారం డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీచేశారు. ఆళ్లగడ్డ అర్బన్ పీఎస్ సీఐగా ఉన్న ఎస్.చిరంజీవిని కర్నూలు ఫ్యాక్షన్ జోన్ సీఐగా బదిలీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు టూ టౌన్ సీఐగా ఉన్న ఎం.యుగంధర్ ఆళ్లగడ్డ UPS సీఐగా, నంద్యాల VRలో ఉన్న ఎం.గంగిరెడ్డి నంద్యాల సీసీఎస్-2 సీఐగా నియమితులయ్యారు. కర్నూలు VRలో ఉన్న వీ.శ్రీహరి మైదుకూరు UPSకు బదిలీ అయ్యారు.
Similar News
News November 1, 2025
NRPT: నేటి నుంచి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు

నారాయణపేట జిల్లాలో శనివారం నుంచి పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రకటించారు. నవంబర్ 30 వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ, కార్మిక, విద్యార్థి, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు నిరసనలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టే వార్తలు వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
News November 1, 2025
రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వానలు పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచించింది. కృష్ణా నదికి వరద తాకిడి ఉండటంతో పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News November 1, 2025
కాకినాడ: ప్రజాప్రతినిధులకి సత్కారాలా..! అధికారులలో నిరాశ

మొంథా తుఫాన్ సమయంలో కష్టపడిన కాకినాడ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం చంద్రబాబు సన్మానించడం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు కష్టపడ్డారని, వారిని కాదని ప్రజాప్రతినిధులకు సన్మానం చేయడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఓటేసి గెలిపించింది సేవ చేయడానికేనని, కష్టపడిన ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులను కూడా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.


