News February 26, 2026

BREAKING ఉమ్మడి పాలమూరులో IAS అధికారుల బదిలీ

image

రాష్ట్ర ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు కలెక్టర్లు సహా ఇద్దరు అదనపు కలెక్టర్లపై బదిలీ చేసింది. మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, గద్వాల కలెక్టర్ బి.ఎం.సంతోష్‌లను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ (మహబూబ్‌నగర్), కీమ్యా నాయక్ (వనపర్తి)లకు కూడా స్థానచలనం కలిగింది.

Similar News

News April 14, 2026

‘త్రిశంకు స్వర్గం’ గురించి తెలుసా?

image

అటూ ఇటూ కాకుండా నిలిచిపోయిన పరిస్థితిని ఈ జాతీయంతో పోలుస్తాం. ఇక్ష్వాకు వంశ రాజు త్రిశంకుడికి మానవ శరీరంతోనే స్వర్గంలోకి వెళ్లాలని కోరిక. దానికోసం యజ్ఞం నిర్వహించాలని వశిష్ఠుడిని కోరగా తిరస్కరిస్తారు. విశ్వామిత్రుడు తన తపోశక్తితో ఆయనను స్వర్గ ద్వారం వద్దకు చేరుస్తారు. ఇంద్రుడు అడ్డుకోవడంతో త్రిశంకుడు భూమిపై పడిపోతుండగా విశ్వామిత్రుడు మరో స్వర్గాన్ని సృష్టిస్తారు. అదే త్రిశంకు స్వర్గం. <<-se>>#EPICSAYINGS<<>>

News April 14, 2026

29న క్యాబినెట్ భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై చర్చ!

image

AP: ఈనెల 29న వెలగపూడి సచివాలయంలో CM CBN అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈమేరకు ప్రతిపాదనలతో నివేదికలు పంపాలని CS అన్ని శాఖలకు సర్క్యులర్ జారీచేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, అమరావతి రెండో దశ భూ సమీకరణ, తొలిదశ సేకరించిన భూముల్లో పనుల పురోగతి, వివిధ సంస్థలకు భూముల కేటాయింపు, ఎంఓయూల మేరకు వివిధ సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.

News April 14, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,300
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14.076
*వెండి 10 గ్రాముల ధర రూ.2,470