News February 26, 2026

BREAKING: ఉమ్మడి వరంగల్‌లో భారీగా IASల బదిలీలు

image

హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. చాహత్ బాజ్ పాయ్‌ను హనుమకొండ కలెక్టర్‌‌గా నియమించిన ప్రభుత్వం.. GWMC ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. జనగామ కలెక్టర్‌ రిజ్వాన్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝాను, ఏటూరునాగారం ITDA పీవో చిత్రమిశ్రా కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. వరంగల్ లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్‌గా గణేశ్‌ను నియమించారు.

Similar News

News April 19, 2026

HYDలో భారీ డిమాండ్..!

image

గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు సృష్టించింది. 2 రోజులుగా అత్యధికంగా 99- 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా మేలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడంతో మార్చి నుంచే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ఇదే సమయంలో ఆర్టిజన్లు సమ్మెకు దిగడంతో నిత్యం కరెంట్ కట్‌లతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడంలేనట్లు తెలుస్తోంది.

News April 19, 2026

మహబూబాబాద్: కాంగ్రెస్‌‌లో పదవుల కోలాహలం!

image

కాంగ్రెస్‌‌లో కమిటీల కసరత్తు జరుగుతోంది. పార్టీలో పదవుల కోలాహలం మొదలైంది. మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. కాంగ్రెస్ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులు కావాలంటే కచ్చితంగా కనీసం మూడేళ్లయినా కాంగ్రెస్‌లో సంస్థాగతంగా పనిచేయాల్సిందే‌నని, అలాంటి వారికే పదవులు ఇవ్వలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన జారీ చేశారు. నాయకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

News April 19, 2026

ప్రశాంతంగా ముగిసిన మక్తల్‌ ఉప ఎన్నిక

image

మక్తల్‌ మున్సిపాలిటీ 6వ వార్డు ఉప ఎన్నిక పోలింగ్‌ శనివారం ప్రశాంతంగా ముగిసింది. అదనపు కలెక్టర్‌ ఫణీంద్రరెడ్డి పోలింగ్‌ సరళిని స్వయంగా పరిశీలించారు. ఈ ఎన్నికలో 89.05 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు రిటర్నింగ్‌ అధికారి నాగశివ తెలిపారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.