News April 1, 2025
BREAKING: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. గుర్రంపోడులో ఆలయ వార్షికోత్సవానికి వచ్చి వెళ్తుండాగా వద్దిరెడ్డిగూడెం వద్ద కాన్వాయ్లో గన్మెన్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగలగా మంటలు చెలరేగాయి. ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
వికారాబాద్ నూతన SP స్నేహ మెహ్రా నేపథ్యం ఇదే.!

2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి స్నేహ మెహ్రా వికారాబాద్ ఎస్పీగా నియమితులయ్యారు. గతంలో వైరా ఏసీపీగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా ఆమె పనిచేశారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా నియమితులైన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందిన స్నేహ మెహ్రా, ఆరు నెలల పాపతోనే పాతబస్తీలో విధులు నిర్వర్తించి అంకితభావం చాటారు.
News November 21, 2025
కొత్త లేబర్ కోడ్లో ఉపయోగాలు ఇవే..

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్లు
* ఫిక్స్ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి
News November 21, 2025
హనుమాన్ జంక్షన్: విద్యార్థినులకు వేధిస్తున్న ఆకతాయిల అరెస్ట్

హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో ఆకతాయిల హంగామా సృష్టించారు. ద్విచక్ర వాహనాలపై ఆర్టీసీ ఆవరణలో తిరుగుతూ కాలేజీ విద్యార్థినులతో అసభ్యకరంగా, ఎగతాళిగా మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన జంక్షన్ పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


