News November 9, 2024
BREAKING: ఎమ్మెల్యే తాటిపర్తిపై కేసు నమోదు
మంత్రి నారా లోకేశ్‌పై అసత్య ఆరోపణలు చేశారంటూ MLA తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. యర్రగొండపాలెం టీడీపీ కార్యకర్త చేదూరి కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చౌడయ్య తెలిపారు. సెప్టెంబర్ 18న లోకేశ్‌పై వారం వారం పేకాట క్లబ్ ద్వారా లోకేశ్‌కు కమీషన్ అందుతున్నాయని X వేదికగా ఎమ్మెల్యే పోస్టు చేశారు. కార్యకర్త ఫిర్యాదుతో వాట్సాప్ ద్వారా పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులిచ్చారు.
Similar News
News December 10, 2024
జమ్మూలో కంభం ఆర్మీ జవాన్ మృతి
ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సోమవారం జమ్మూ కశ్మీర్‌లో మృతి చెందాడు. 25వ రాష్ట్రీయ రైఫిల్స్ హవల్దార్‌గా పని చేస్తున్న వరికుంట్ల వెంకట సుబ్బయ్య అనే జవాన్ జమ్మూ కశ్మీర్‌లో వీధులు నిర్వహిస్తుండగా మందు పాతర పేలి వీర మరణం పొందాడు. కాగా ప్రస్తుతం అతని మృతదేహాన్ని రాజా సుఖదేవ్ సింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
News December 10, 2024
ప్రకాశం: నకిలీ పెన్షన్లపై అధికారుల దృష్టి
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ నిర్వహించే ఉత్తర్వులలో భాగంగా.. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మండలం చిలకపాడు గ్రామాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి మొదటిరోజు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలపై మీరేమంటారో కామెంట్ చేయండి.
News December 9, 2024
పర్చూరు వద్ద ఒకే రోజు నలుగురు మృతి
పర్చూరు మండలం అన్నంబట్లవారిపాలెం సమీపంలో బైక్‌పై బీచ్‌కు వెళ్లి వస్తున్న <<14826140>>ముగ్గురిని ఆదివారం ఓ లారీ ఢీకొంది.<<>> ఈ ప్రమాదంలో అత్తా, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె చికిత్స పొందుతూ చనిపోయింది. అదే ప్రాంతంలో తూమాటి సుబ్బయ్య(74) అనే వ్యక్తి <<14827146>>సైకిల్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని మృతి<<>> చెందాడు. ఇలా ఒకే రోజు మండలంలో నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.