News April 28, 2024

BREAKING: కడప-తాడిపత్రి హైవేపై రోడ్డు ప్రమాదం

image

కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని వల్లూరు మండలం తోల్లగంగనపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కడప నుంచి కమలాపురం వైపు బైక్‌లో వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Similar News

News October 28, 2025

తుఫానుపై ఆందోళన వద్దు: కడప ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

తుఫాను ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదిదిసింగ్ సూచించారు. జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం ఆమె టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర చర్యలకు కడపతోపాటు RDO కార్యాలయాలన్నింటిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News October 27, 2025

కడప జిల్లా కలెక్టర్ తనయుడికి పలువురు నేతల శుభాకాంక్షలు

image

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తనయుడు రిసెప్షన్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ రిసెప్షన్‌కు ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కడప జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన జంట వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

News October 27, 2025

మొంథా తుఫాన్.. కడప JC కీలక సూచనలు

image

కడప జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు JC అదితి సింగ్ పలు <>సూచనలు<<>> చేశారు.
➤సోషల్ మీడియాలో వచ్చే అవాస్థవాలను నమ్మొద్దు.
➤వాతావరణ హెచ్చరికల కోసం సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకొని, SMSలను గమనిస్తూ ఉండండి.
➤విలువైన పత్రాలను వాటర్ ఫ్రూఫ్ కవర్లలో ఉంచండి.
➤మీ ఇల్లు సురక్షితం కాకపోతే.. సురక్షితమైన స్థానాలకు వెళ్లండి.
➤పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్ల కింద ఉండకండి.
>> SHARE IT