News April 28, 2024

BREAKING: కడప-తాడిపత్రి హైవేపై రోడ్డు ప్రమాదం

image

కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని వల్లూరు మండలం తోల్లగంగనపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కడప నుంచి కమలాపురం వైపు బైక్‌లో వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Similar News

News November 2, 2024

కడప జిల్లాకు రానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి.. ఎప్పుడంటే.!

image

కడప జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఈనెల 5న జిల్లాకు రానున్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో మొదటిసారి ఆమె జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం కడప కలెక్టరేట్‌లో జరిగే జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశానికి మంత్రి హాజరుకానున్నారు. జిల్లాకు రానున్న మంత్రి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో భేటీ కానున్నారు. అనంతరం జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.

News November 1, 2024

కడప: 4 నుంచి బీఈడీ సెమిస్టర్‌ పరీక్షలు

image

వైవీయూ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో 2, 4 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ నెల 4వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలను జిల్లాలోని కేంద్రాలను నిర్వహిస్తున్నామని 16,900 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. హాల్ టికెట్లను చదువుతున్న కళాశాల నుంచి పొందాలని సూచించారు.

News November 1, 2024

పుల్లంపేట: మహిళ చీరకు అంటుకున్న మంట

image

కొవ్వొత్తి పొరపాటున చీరకు అంటుకొని మహిళ గాయాలపాలైన ఘటన పుల్లంపేట మండలంలోని రామాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఓ మహిళ ఇంట్లో దీపాలు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చీరకు మంట అంటుకొని గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.