News March 11, 2025
BREAKING: కాండ్రేగులలో స్కూల్ బస్సు బోల్తా

జగ్గంపేట మండలం కాండ్రేగులలో మంగళవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సు మలుపు వద్ద బోల్తా పడింది. దీంతో బస్సులోని 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులకు జగ్గంపేటలోని సీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2026
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు: డీఎంహెచ్‌ఓ

హనుమకొండ జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జూన్ 12 వరకు నాలుగు దశల్లో వైద్య పరీక్షలు, అసంక్రమిత, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏ.అప్పయ్య తెలిపారు. తొలి దశలో ఈనెల 6 నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులచే శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News March 6, 2026
HYD: ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.. జాగ్రత్త..!

HYDవాసులను జలమండలి బిల్లుల కంటే కేటుగాళ్ల మెసేజ్‌లే ఎక్కువ భయపెడుతున్నాయి. బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటూ HMWSSBపై ఫేక్ లింకులు పంపిస్తున్నారు. తెలీక ఆ లింక్ నొక్కితే అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే సిటీలో రూ.కోట్లు కాజేసినట్లు సమాచారం. డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు మాత్రం మేము అలాంటి మెసేజ్‌లే పంపమని చేతులు దులుపుకుంటున్నారు. కాగా, కస్టమర్ల వివరాలు బయటకెలా వెళ్తున్నాయో మాత్రం తెల్వట్లేదు.
News March 6, 2026
RR: మార్కెటింగ్‌పై మహిళలకు ఉచిత శిక్షణ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ మహిళలు, యువతులకు మార్కెటింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తామని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ శైలకుమారి తెలిపారు. చిలుకూరులోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఈనెల 17 నుంచి 3 నెలల పాటు రిటైల్ సేల్స్ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, పదో తరగతి పాసై, 18 ఏండ్లు నిండిన వారు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 7660022524ను సంప్రదించాలన్నారు.


