News March 1, 2025

BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

image

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.

Similar News

News December 11, 2025

నిజామాబాద్ జిల్లాలో భారీ మెజారిటీతో తొలి విజయం

image

మోస్రా మండలం దుబ్బ తండా గ్రామ పంచాయతీ సర్పంచిగా లునావత్ శివ 114 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 254 ఓట్లు పోలయ్యాయి. 184 ఓట్లు గెలుపొందిన అభ్యర్థి లునావత్ శివకుమార్‌కు రాగా ప్రత్యర్థి వీరన్నకు 70 ఓట్లు పోలయ్యాయి. భారీ విజయంతో సర్పంచి పీఠం లునావత్ శివ కైవసం చేసుకోవడంతో గ్రామంలో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

News December 11, 2025

కామారెడ్డి జిల్లాలో 5 ఓట్ల తేడాతో తొలి విజయం

image

బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భాగ్యమ్మ విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి లక్ష్మీపై ఐదు ఓట్ల తేడాతో భాగ్యమ్మ విజయం సాధించారు. దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. సర్పంచ్ స్థానం కోసం పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రచారం కొనసాగింది. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.

News December 11, 2025

నిజామాబాద్‌లో పోలింగ్ శాతం ఎంత అంటే?

image

తొలి దశ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన మధ్యాహ్నం1 గంట వరకు 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. బోధన్ మండలంలో 84.88%, చందూరు-79.95%, కోటగిరి-78.05%, మోస్రా-76.09%, పొతంగల్- 82.21%, రెంజల్- 80.91%, రుద్రూరు-84.05%, సాలూర-85.91%, వర్ని-78.74%, ఎడపల్లి-67.11%, నవీపేట-76.78% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.