News March 1, 2025
BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.
Similar News
News March 3, 2025
ALERT: మీ ఫోన్ పోయిందా?

ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే అందులోని సిమ్ను బ్లాక్ చేయాలని TG పోలీసులు సూచిస్తున్నారు. ఆ నంబర్తో లింకై ఉన్న బ్యాంకు లావాదేవీలనూ నిలిపివేయాలని చెబుతున్నారు. ఫోన్ పోగొట్టుకున్న వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షల్లో డబ్బులు మాయమవుతున్న ఘటనలు ఇటీవల పెరిగాయని తెలిపారు. ఫోన్ నంబర్ సాయంతో ఆన్లైన్ మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని, అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
News March 3, 2025
HYD: మహిళలపై అత్యాచారం.. వారే అధికం..!

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది నమోదైన అత్యాచార కేసుల్లో అత్యధికులు స్నేహితులు ఉండగా, తర్వాత సహోద్యోగులు, సంరక్షకులు, పని వాళ్లు, డ్రైవర్లు, బంధువులు ఉన్నారు. మరోవైపు ఇరుగు పొరుగువారు, కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తేలింది. వీటి కోసం ఉమెన్ సేఫ్టీ సస్పెక్ట్ రిజిస్ట్రీ మైంటైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు మహిళ యొక్క పరిస్థితి, వేధింపులను గూర్చి తెలుసుకోవడంతో పాటు నిఘా బెడుతున్నారు.
News March 3, 2025
వెయ్యి మందిని తొలగిస్తున్న ఓలా ఎలక్ట్రిక్!

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వెయ్యికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. నష్టాలను తగ్గించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. దాదాపుగా అన్ని శాఖలపై ఈ ప్రభావం పడనుంది. ప్రస్తుతం కంపెనీలో 4000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2023, NOVలోనూ ఓలా 500 మందిని తీసేసింది. నష్టాలు, మార్కెట్ కరెక్షన్ వల్ల 60% తగ్గిన ఓలా షేర్లు ప్రస్తుతం రూ.55 వద్ద కొనసాగుతున్నాయి.