News March 1, 2025

BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

image

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.

Similar News

News March 17, 2025

బాపట్ల: పీజీఆర్‌ఎస్‌కు 54 అర్జీలు

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 54 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.

News March 17, 2025

పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీ ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ (రేపు) నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

News March 17, 2025

NZB: ప్రజావాణికి 64 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు  అర్జీలు సమర్పించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

error: Content is protected !!