News March 1, 2025
BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.
Similar News
News March 25, 2025
NZB: అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించిన పల్లె గంగారెడ్డి

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి సోమవారం అస్సాం రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అస్సాం, త్రిపుర రాష్ట్రాల సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్ర రాజుని కలిశారు. అనంతరం ఆయనతో పలు అంశాలపై చర్చించారు. అక్కడి రాష్ట్రాల్లో పసుపు పంట సాగు గురించి అలాగే పసుపు ఉత్పత్తుల గురించి చర్చించి పలు విషయాలను తెలుసుకున్నారు.
News March 25, 2025
NZB: 31లోగా దరఖాస్తు చేసుకోవాలి

ప్రతి సంవత్సరం నిర్వహించే వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా వివిధ క్రీడాంశాలలో ఆసక్తి గల వారు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జే.ముత్తన్న తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతితో మే 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో 10 వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 25, 2025
NZB: ‘ఉద్యోగులకు గౌరవవేతనం ఇప్పించండి’

వివిధ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు గౌరవ వేతనం వెంటనే ఇవ్వాలని కోరుతూ టీజీవో జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అలక కిషన్, అమృత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని.. వెంటనే సెక్షన్ ఆఫీసర్‌తో సమీక్షించి ఆలస్యం చేయకుండా ఎన్నికల అధికారి నివేధిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.