News February 8, 2025
BREAKING: కామారెడ్డి జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం

KMRజిల్లాలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. KMRడిపోకు చెందిన RTCబస్సు భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది వైర్లతో సహా రోడ్డుపై పడింది. ప్రయాణికులు భయపడి బస్సు దిగి పరుగులు తీశారు. వైర్లు ఏ మాత్రం బస్సుపై పడినా భారీ ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే కరెంట్ కట్ అవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News March 23, 2025
సిరిసిల్ల: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
News March 23, 2025
BRS రజతోత్సవ వేడుకలపై నేడు కేటీఆర్ సమీక్ష

TG: కరీంనగర్‌లో నేడు జరగనున్న BRS రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల నుంచి ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి రానున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వచ్చే నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై సమీక్షించడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
News March 23, 2025
సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేసిన కలెక్టర్

సదాశివపేట మండలం నాగసాన్ పల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం జారీ చేశారు. గ్రామంలో ఫైనల్ నోటిఫికేషన్ చేయకుండానే వెంచర్లకు అనుమతి ఇచ్చారని, కొందరు డీపీవోకు ఫిర్యాదు చేశారు. డీపీవో విచారణ నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.