News August 31, 2024

BREAKING: కామారెడ్డి జిల్లాలో విషాదం

image

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లిలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. భారీ వర్షానికి ఇంటి వెనుక ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో ఇంటిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కాగా ఇంట్లో ఉన్న డిగ్రీ విద్యార్థిని స్వాతి(18) కరెంట్ షాక్‌తో మృతిచెందింది. తీగలు తెగి పడడంతో రేకుల ఇంటికి కరెంట్ పాసైంది. స్వాతి.. ఇంటి తలుపులు ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి చనిపోయింది.

Similar News

News September 14, 2024

NZB: కాకతీయ కాలువ పరివాహక ప్రాంత ప్రజలకు గమనిక

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ (LMD పైన) పరివాహక ప్రాంత ప్రజలకు పోచంపాడ్ డ్యాం సైట్ కార్యనిర్వాహక ఇంజనీర్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరిక జారీ చేశారు. కాకతీయ కాలువలో నీటి ప్రవాహం తిరిగి మొదలైనందున కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. కనుక కాల్వ దరిదాపుల్లోకి ప్రజలు ఎవరూ రావద్దని, ప్రమాదానికి గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

News September 14, 2024

రాష్ట్ర వ్యవసాయ సలహాదాడిగా బాధ్యతలు స్వీకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే

image

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమితులైన బాన్సువాడ MLA పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. HYD నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని హార్టికల్చర్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొని పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

News September 14, 2024

దోమకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

రోడ్డు ప్రమాదం ఇద్దరి స్నేహితుల కుటుంబాలలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన జొన్నల రాము(23), ముత్తి రమేశ్(24))లు రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న వినాయకుడి పూజా సామగ్రి కోసం బైక్‌పై కామారెడ్డికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉగ్రవాయి స్టేజి వద్ద వీరి వాహనాన్ని మరో బైక్‌ ఢీకొట్టింది.