News November 1, 2024
BREAKING: కామారెడ్డి జిల్లాలో హత్య

కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నస్రుల్లాబాద్ మండలంలో కొడుకు హన్మాండ్లు తండ్రి సాయిబోయి(55) ని కర్రతో కొట్టి హత్య చేశాడు. మద్యం మత్తులో చంపినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 19, 2025
NZB: రేషన్ కార్డు… E-KYCపూర్తి చేసుకోండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుదారులు తమ వేలిముద్ర సహాయంతో E-KYC పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో మొత్తం 467295 కార్డుల్లోని 1572176 మంది లబ్దిదారులకు గాను 1103928 (70.22%) లబ్దిదారులు మాత్రమే E-KYC పూర్తిచేసుకున్నారని, మిగతా 468251 (29.78%) లబ్దిదారులు సమీపంలోని తమ రేషన్ షాప్ కు వెళ్లిE-KYC పూర్తిచేసుకోవాలన్నారు.
News December 19, 2025
NZB: కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు రూ. కోటి చెక్కు

ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన CCSకానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి చెక్కును పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అందించారు. పోలీస్ సాలరీ ప్యాకేజ్ వర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో పోలీస్ సాలరీ ప్యాకేజ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో ఈ చెక్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ACP రాజా వెంకట్ రెడ్డి, SBI అధికారులు రవి కిరణ్, మహేశ్వర్ పాల్గొన్నారు.
News December 19, 2025
అందరి సహకారంతో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్

అందరి సహకారంతో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని NZB జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ పరస్పర సమన్వయంతో కృషి చేసిన ఫలితంగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించుకోగలిగామని అన్నారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తరహాలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.


