News August 2, 2024
BREAKING.. కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 44 నంబర్ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు సదాశివనగర్ పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News December 12, 2025
నిజామాబాద్: మైకులు ఆగాయి, మందు షాపులు మూతపడ్డాయి!

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నిక గురువారంతో ముగిసింది. రెండో విడతలో భాగంగా ఎనిమిది మండలాలకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, ముగ్పాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పక్షం రోజులుగా గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. ఎటు చూసినా మైకులు, నేతల ఉరుకుల పరుగులు, ఏ విధి చూసినా ప్రచారహోరే వినిపించింది.
News December 12, 2025
NZB: మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని రైతులకు తొలి విడతగా రూ. 10.00 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 2,63,016 క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు.
News December 12, 2025
NZB: 132 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం

నిజామాబాద్ జిల్లాలో తొలి దశలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. 184 GPల్లో 29 ఏకగ్రీవం కాగా 155 GPలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ మద్దతుదారులు 132, బీజేపీ మద్దతుదారులు 15, BRS మద్దతుదారులు 15, జాగృతి మద్దతుదారులు నలుగురు, ఇతరులు 18 చోట్ల గెలుపొందారు.


