News March 31, 2025
BREAKING: కిష్టాపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

సూర్యాపేట జిల్లా చింతలపాలెం కిష్టాపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సభకు కార్యాకర్తలను తరలించే విషయంలో ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తినట్లు స్థానికులు తెలిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో పలు బైకులు, ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసమైయ్యాయి. ఐదుగురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News December 4, 2025
GHMC మెగా విలీనంపై అడ్డంకులు.. మరో ఏడాది HMDA నిబంధనలే!

విశాలమైన GHMC ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనా క్షేత్రస్థాయిలో పాలనా ప్రణాళికకు అడ్డంకులు తప్పడం లేదు. 27 ULBsను విలీనం చేసినప్పటికీ పౌరులకు ఏకరూప నిబంధనలు ఇప్పట్లో అందుబాటులోకి రావు. విలీన ప్రాంతాల్లో ప్రస్తుత HMDA మాస్టర్ ప్లాన్ 2013 జోనల్ నిబంధనలే ఇంకో ఏడాది పాటు అమలులో ఉంటాయి. సంక్లిష్టమైన రూల్స్‌ను ఏకీకృతం చేయడంలో అధికారుల జాప్యం కారణంగా కొత్త GHMC, HMDA మాస్టర్ ప్లాన్ 2031 ఆలస్యం కానుంది.
News December 4, 2025
అమరావతి: బ్లడ్ టెస్టుల పేరుతో భారీగా వసూళ్లు

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రైవేటు రక్త పరీక్షా కేంద్రాలు రక్తాన్ని పీల్చినట్లు సామాన్యుల నుంచి డబ్బులు లాగేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు రోగనిర్ధారణ టెస్టుల పేరుతో రక్త పరీక్షలు చేయించాలని, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ ల్యాబ్‌లకు సిఫార్సు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, అధికారుల తనిఖీలు కరువయ్యాయని వాపోతున్నారు. మీ ఏరియాలో పరిస్థితిపై కామెంట్ చేయండి.
News December 4, 2025
రూ.14,00 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు: కలెక్టర్

జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.


