News April 14, 2025

BREAKING.. కుషాయిగూడలో మర్డర్

image

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 30, 2025

అన్నమయ్య: ‘సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

అన్నమయ్య జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ధీరజ్ సూచించారు. స్కాలర్‌షిప్‌లు, తుఫాను పరిహారం పేరుతో విద్యార్థులు, రైతులను లక్ష్యంగా చేసుకుని మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News October 30, 2025

పార్వతీపురం జిల్లాలో 1,752 ఎకరాల్లో పంట నష్టం అంచనా

image

మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని 10 మండలాల్లో 1,591 ఎకరాలల్లో వరి, మూడు మండలాల్లోని 161 ఎకరాలలో ప్రత్తి పంట వెరసి 1,752 ఎకరాల్లో నీట మునిగినట్లు జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్ది ఓ ప్రకటనలో తెలిపారు. పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ సిబ్బందిని ఆదేశించారు.

News October 30, 2025

ఇవాళ స్కూళ్లకు సెలవు

image

మొంథా తుఫాను తెలంగాణపై విరుచుకుపడుతోంది. కుండపోత వర్షాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇవాళ సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. అటు ఏపీలోని విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి(ప్రైమరీ స్కూల్స్) జిల్లాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చారు. మరి మీ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు ఉందా? COMMENT