News April 14, 2025
BREAKING.. కుషాయిగూడలో మర్డర్

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 12, 2025
HYD: ఈ టైమ్‌లో 70% యాక్సిడెంట్స్.. జాగ్రత్త..!

HYDలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధికంగా రాత్రి ఒంటిగంట నుంచి ఉ.10 గంటల మధ్యలో సుమారు 70% ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతివేగం, మద్యం మత్తులో వాహనంపై పట్టుకోల్పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. మద్యం తాగి వాహనం నడపొద్దని, ఓవర్ స్పీడ్ వద్దని పోలీసులు సూచిస్తున్నారు.
News November 12, 2025
ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. HYDలో హై అలర్ట్

న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది. దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు సికింద్రాబాద్, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.
News November 12, 2025
HYD: పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకట్లే సారూ!

HYD, రంగారెడ్డి, మేడ్చల్‌లో ORR వరకు నిర్వహించిన సర్వేలో పెళ్లిపిల్ల కోసం అనేకులు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ, వధువు దొరకడం లేదని యంగ్ ఏజ్ మ్యారేజ్ సర్వే వెల్లడించింది. కాగా.. 3 ఏళ్లలో దాదాపు 45 శాతం మందికి అమ్మాయిలు దొరకక ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. దీనికి ఉద్యోగం, సంపాదన, సొంతిళ్లు ఇలా పలు కారణాలు ఉన్నాయంది. ఓవైపు పిల్ల దొరకక, మరోవైపు వయసు మీద పడుతుంటే సింగిల్స్‌కు టెన్షన్ పెరుగుతోంది.


