News April 14, 2025
BREAKING.. కుషాయిగూడలో మర్డర్

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 5, 2026
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

ఉద్యోగులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని BC సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని గురువారం సచివాలయంలో ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
News March 5, 2026
పెద్దపల్లి: స్పెషలిస్ట్ ఆరోగ్య శిబిరాల షెడ్యూల్ ఇలా…

జిల్లా PHC/UHCలలో స్పెషలిస్ట్ ఆరోగ్య శిబిరాల షెడ్యూల్: మార్చి 6- PHC రాఘవపూర్, 7- PHC ఓదెల, UHC అడ్డగుంటపల్లి, 9- UHC అల్లూరు, PHC పుట్నూరు, 10- UHC జనగాం, 5 ఇంక్లైన్, 11- PHC రాగినేడు, లక్ష్మీపూర్, 12- UHC పెద్దపల్లి, PHC రామగుండం, 14- అంతర్గాం, 16- బసంత్ నగర్, 17- బేగంపేట, 18- ఎలిగేడు, 20- గద్దలపల్లి, 23 -గర్రెపల్లి, 24 -జూలపల్లి, 25 -కమాన్పూర్, 26- కొలనూరు, 28 కునారం, 30 -మేడారం, 31 -ముత్తారం.
News March 5, 2026
US దాడి చేస్తే ఇండియాపై నిందలేంటి: అమిత్ మాలవీయ

ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేస్తే ఇండియాను నిందించడంలో లాజిక్ లేదని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘భారత తీరానికి 250 నాటికల్ మైళ్ల దూరంలో, సముద్ర పరిధికి అవతల అటాక్ జరిగింది. సమీపంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఘటనకు ఆ దేశం బాధ్యత వహించదు. అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలను IND నియంత్రించదు. US-ఇరాన్ మధ్య జరిగిన దానికి ఇండియాను జవాబుదారీగా చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’ అని ట్వీట్ చేశారు.


