News November 22, 2024
BREAKING.. కొండగట్టు వద్ద ఎదురుదెరుగా ఢీకొన్న లారీలు

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో లారీల మధ్యలో ఇద్దరు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 23, 2025
KNR: షోకాజ్ నోటీసులపై అదనపు కలెక్టర్కు ‘టీటీయూ’ వినతి

పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) నాయకులు సోమవారం అదనపు కలెక్టర్, డీఈవో డాక్టర్ అశ్వినీ తనజీ వాంక్డేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అనారోగ్యం లేదా ఇతర సహేతుకమైన (జెన్యూన్) కారణాలతో విధులకు రాలేని వారికి తప్పనిసరిగా మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు.
News December 22, 2025
KNR: JAN 31 వరకు ఉచితంగా మందులు

కరీంనగర్ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం సోమవారం కొత్తపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా అధికారి డాక్టర్ ఎన్. లింగారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, జీవాలకు మందులు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 22 నుంచి జనవరి 31 వరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
News December 22, 2025
KNR: ‘డ్రగ్స్ నిర్మూలనకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి’

KNR జిల్లాలో మాదకద్రవ్యాల వాడకాన్ని అరికట్టేందుకు అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మెడికల్ స్టోర్లలో వైద్యుల చీటీ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థలలో అవగాహన కల్పించాలన్నారు.


