News January 27, 2025
BREAKING: కొండపాకలో యాక్సిడెంట్.. సెక్యూరిటీ గార్డ్ మృతి

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి శివారులో సోమవారం బైక్‌ను వ్యాన్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాంపల్లి గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి(35) స్థానిక టోల్ ప్లాజాలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని గ్రామానికి బైక్‌పై రాంపల్లి శివారులో వ్యాన్ ఢీకొట్టింది. తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Similar News
News February 9, 2025
మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే రిస్క్‌లో పడ్డట్లే…

మీ పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్లు ఇస్తున్నారా.. అయితే వారికి మీరు కీడు చేసినట్లే. చిన్నపిల్లల్లో 6నెలల నుంచి మాటలు రావటం ప్రారంభమవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూనే వారు మాట్లాడటం నేర్చుకుంటారు. ఈ వయసులో ఫోన్లు ఇవ్వటం ద్వారా వాటినే చూస్తుంటారు. తద్వారా మూడేళ్ల దాకా మాటలు రాకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆటిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
News February 9, 2025
పల్నాడు ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లా ముప్పాళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
News February 9, 2025
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

AP: తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇందులో ఏఆర్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. వీరిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సీబీఐ జేసీ వీరేశ్ ప్రభు తిరుపతిలోనే ఉండి విచారణను వేగవంతం చేశారు.