News February 28, 2025
BREAKING: కొత్తగూడెం.. ఏసీబీకి చిక్కిన HM

కొత్తగూడెం టౌన్ కూలీ లైన్ హైస్కూల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హెడ్ మాస్టర్ రవీందర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు. కరాటే శిక్షణకు పాఠశాలకు రూ.30 వేలు మంజూరయ్యాయి. ఇన్స్ట్రక్చర్కు ఇవ్వాల్సిన రూ.30 వేలల్లో రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News September 13, 2025
హుజూర్నగర్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

హుజూర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణించిన మూడు రోజులకే భార్య మృతి చెందారు. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి అప్పారావు గుండెపోటుతో సెప్టెంబర్ 10న మృతి చెందారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య గెల్లి అరుణ శనివారం మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
News September 13, 2025
అలంపూర్లో భక్తుల రద్దీ

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం మహా నివేదన సమయంలో భక్తులు దర్శనాల కోసం వేచి చూశారు. అనంతరం హారతులు అందుకున్నారు.
News September 13, 2025
బీటెక్ అర్హత.. CRDAలో 132 ఉద్యోగాలు

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(AP CRDA)లో 132 ఇంజినీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26 చివరి తేదీ. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేయనున్నారు. ఆయా విభాగాల్లో బీటెక్ పాసైన వారు అర్హులు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం <