News March 1, 2025
BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
KNR: డిసెంబర్ 1 నుంచి 6 వరకు డి.ఎల్.ఇడి పరీక్షలు: డీఈఓ

కరీంనగర్ జిల్లాలోని డి.ఎల్.ఇడి. (D.El.Ed.) ప్రథమ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించబడతాయని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఎస్. మొండయ్య తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండు పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ సూచించారు.
News November 24, 2025
HYD: రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం: KTR

తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయని ఢిల్లీలో ఎండగడతామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42% బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్టు రాహుల్ గాంధీ చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.
News November 24, 2025
అన్నదాతల సాధికారతకు రైతన్నా మీకోసం: కలెక్టర్

అన్నదాతల సాధికారతే లక్ష్యంగా ఈ రోజు నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ఆర్థిక సాధనకు మూలస్తంభమైన వ్యవసాయ రంగాన్ని పరిపుష్టి చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని వివరించారు.


