News November 11, 2024

BREAKING: కోళ్ల ఫాం గోడ కూలి ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. చిన్న శంకరంపేట మండలంలో గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. కామారం తండాలో కోళ్ల ఫాం నిర్మిస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఝార్ఖండ్‌కు చెందిన రఖీవాల, అసిక్కుల్ షేక్‌గా గుర్తించారు. మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News December 3, 2024

మెదక్: ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొన్నం

image

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బీసీ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేక సంస్కరణలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీని 5 లక్షలకు ఉన్న పరిమితి 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఖర్చైనా వెనకాడమన్నారు.

News December 2, 2024

అందోల్: అంబులెన్స్‌లు ప్రారంభించిన మంత్రి దామోదర్

image

హైదరాబాదులోని ఎన్టీఆర్ మార్గ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్కతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ అంబులెన్స్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య సబ్ సెంటర్లు, PHC, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు రూ.500 కోట్ల విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే అని ఆయన అన్నారు. పేదవాని వైద్యం, విద్య మా బాధ్యతగా భావించేది కాంగ్రెస్ అని తెలిపారు.

News December 2, 2024

అందోల్: వైద్యం వ్యాపార పరం కావొద్దు: మంత్రి రాజనర్సింహ

image

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని మంత్రి రాజనర్సింహ అన్నారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ ఆరోగ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. వైద్యం వ్యాపార పరం కావొద్దని, ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. ఎక్కడా మందుల కొరత లేకుండా చేశామని తెలిపారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.