News February 20, 2025
BREAKING: ఖమ్మం: కాలువలో హోంగార్డు మృతదేహం కలకలం

సాగర్ కాలువలో హోంగార్డు మృతదేహం కలకలం సృష్టించింది. ఈ ఘటన నేలకొండపల్లి మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గంటా నరేశ్ డిగ్రీ కాలేజ్ సమీపంలోని సాగర్ కాలువలో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
OG రిలీజ్.. పేపర్లతో థియేటర్ నిండిపోతుంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది భారీ అంచనాల మధ్య రిలీజయ్యే ‘OG’కి ఇంకెంత క్రేజ్ ఉండాలి. ఈనెల 25న ఫ్యాన్స్ షోలో థియేటర్లను పేపర్లతో నింపేందుకు అభిమానులు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరిలోని సాయి రామ్ థియేటర్లో స్పెషల్ షో కోసం ఏర్పాటు చేసిన పేపర్స్ చూసి ఇతర అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వందల కేజీల న్యూస్ పేపర్లను కట్ చేయడం విశేషం.
News September 16, 2025
ఉప్పల్ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని ఢీకొట్టిన లారీ

ఉప్పల్ NGRI సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని ఢీకొని సెప్టిక్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ కుమార్ నాయక్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ట్యాంకర్ను తొలగించి రోడ్డు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
News September 16, 2025
NGKL: ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

సెప్టెంబర్ 17న నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు ఎస్పీ కార్యాలయం, 9:50 గంటలకు కలెక్టర్ కార్యాలయంపై జాతీయ జెండా ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హాజరవుతారని తెలిపారు.