News January 23, 2025
BREAKING: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం

ఖమ్మం జిల్లా మధిర పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మధిర పరిధి నిదానపురం గ్రామంలో తల్లి ఇద్దరు కూతుళ్లను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఓ చోరీ కేసులో తన భర్త షేక్ బాజీని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లారని, అవమానం భరించలేక భార్య ప్రేజా(35).. కుమార్తెలు మెహక్(6), మెనురూల్(7)ను చంపి తాను ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
కృష్ణా: నాడు నేడు పనులు పూర్తి చేస్తే బాగు.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు పథకం కింద 80 నుంచి 90% వరకు పూర్తయిన పనులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణా జిల్లాలో 100 పైగా పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. సుమారు 600 పైగా స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News November 25, 2025
GHMC కౌన్సిల్ హాల్లో తగ్గేదే లే!

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


