News April 7, 2025
BREAKING: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య

ఖమ్మం పట్టణంలోని నేతాజీనగర్‌లో దారుణ హత్య జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన రవిప్రసాద్ నాలుగు నెలలుగా ఖమ్మంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కాగా, అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రవిప్రసాద్‌ను మహిళ నెట్టేసింది. గోడకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పభుత్వాస్పత్రికి తరలించారు.
Similar News
News October 30, 2025
క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి: సీఎం

ఖమ్మం: మొంథా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
News October 30, 2025
పునరావాస కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం పరిశీలించారు. నయాబజార్ స్కూల్, జూనియర్ కళాశాల శిబిరాల్లోని వసతులు, భోజనం నాణ్యత, హెల్త్ క్యాంప్‌ల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు ఇబ్బంది లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News October 30, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెలవులు రద్దు

ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం తగిన నేపథ్యంలో (రేపు) శుక్రవారం తిరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభమవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నందున మార్కెట్‌ను తిరిగి రేపు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కావున రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.


