News February 21, 2025
BREAKING: ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్లో గల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని డేగల యోగనందిని(17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. ఉదయం స్టడీ అవర్కు హాజరైన ఆమె, హాస్టల్కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. మృతురాలు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక వాసి సత్యరాజ్ కుమార్తెగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.
Similar News
News December 11, 2025
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో కాన్పు, తదనంతర మాతృ మరణాలను నిరోధించాలని కలెక్టర్ కృతికా శుక్లా వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు, గర్భిణుల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా హైరిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించి, క్షేత్రస్థాయి సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News December 11, 2025
VJA: భవానీ భక్తుల కోసం ప్రత్యేక లడ్డూ కౌంటర్లు

భవానీ దీక్ష విరమణ సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాలను బాక్సుల్లో అందుబాటులో ఉంచారు. దీక్ష విరమణ తొలిరోజు గురువారం లడ్డూలు కొనుగోలు చేసిన భక్తులతో దుర్గగుడి ఈవో శీనా నాయక్ మాట్లాడారు. అధిక మొత్తంలో లడ్డూలు కౌంటర్లలో అందుబాటులో ఉండటం, కావలసినన్ని విక్రయించడంతో భవానీ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
News December 11, 2025
ఫకీర్ పేట్ గ్రామపంచాయతీ సర్పంచ్గా విజయలక్ష్మి

కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బొద్దుల విజయలక్ష్మి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఫకీర్ పేట్ గ్రామ సర్పంచ్గా గెలిచారు. తనను గెలిపించిన గ్రామస్థులకు విజయలక్ష్మి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.


