News April 2, 2025
BREAKING: గద్వాలలో విషాదం

కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గద్వాల మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటంపల్లి గ్రామానికి చెందిన యువకుడు నవీన్(30) వీరాపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ఐరన్ విద్యుత్ వైర్లపై పడి కరెంట్ షాక్కు గురై మృతిచెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
సర్వేలులో పీవీ, నారాయణరెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ

ప్రతి విద్యార్థికి చదువు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. సర్వేలు గురుకుల విద్యాలయంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ఆయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, భూదానోద్యమ నాయకుడు, గురుకుల స్థలదాత మద్ది నారాయణరెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు.
News November 23, 2025
యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించారు. డిసెంబర్ 2న ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు, రాందాస్ నాయక్, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తదితరులతో మంత్రి సమీక్షించారు.
News November 23, 2025
పర్సనల్ లైఫ్ తప్ప పైరసీపై నోరుమెదపని iBOMMA రవి?

iBOMMA నిర్వాహకుడు రవి నాలుగో రోజు విచారణలో తన లైఫ్స్టైల్ గురించి పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ‘పైరసీతో వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశా. 15-20 రోజులకొకసారి విదేశాలకు వెళ్లాను. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, US, ఫ్రాన్స్, థాయ్లాండ్, దుబాయ్ తదితర దేశాలు తిరిగాను’ అని చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్ విషయాలు తప్ప పైరసీ నెట్వర్క్ గురించి నోరు తెరవలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.


