News March 30, 2025

Breaking: గద్వాల: చట్నీలో బల్లి

image

గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో బల్లి పడ్డ చట్నీ తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. పట్టణ ఎస్ఐ కళ్యాణరావు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం టిఫిన్ సెంటర్‌ను ఎస్ఐ తనిఖీ చేసి హోటల్ యజమాన్యాన్ని స్టేషన్‌కు తరలించారు.

Similar News

News November 21, 2025

ఏ వ్రతం ఎప్పుడు చేయాలి?

image

పెళ్లి కాని అమ్మాయిలు కాత్యాయనీ వ్రతాన్ని ధనుర్మాసంలో చేయాలి. ఈ వ్రతంలో భాగంగా శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ గోదాదేవి రచించిన 30 పాశురాలను నిత్యం పఠిస్తే.. మంచి భర్త వస్తాడని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ మాసంలోని ప్రతి గురువారం (NOV 27, DEC 4, 11, 18) లక్ష్మీదేవికి పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయట. DEC 3వ తేదీన వస్తున్న హనుమద్వ్రతాన్ని ఆచరించడం ద్వారా కూడా శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.

News November 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మంలో నేడు అందెశ్రీ సంస్మరణ కార్యక్రమం
∆} ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం: పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News November 21, 2025

KMR: BRSపై మంత్రి సీతక్క ఫైర్

image

BRS నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో రైతులు తనను అడ్డుకున్నట్లు BRS సోషల్ మీడియా వింగ్ అసత్య ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు చిత్తుగా ఓడించినా BRSకు ఇంకా బుద్ధి రాలేదు. ఓటమి పాఠాలు నేర్వకుండా ఇంకా విషం చిమ్ముతున్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది’ అని ఘాటుగా హెచ్చరించారు.