News March 30, 2025
Breaking: గద్వాల: చట్నీలో బల్లి

గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో బల్లి పడ్డ చట్నీ తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. పట్టణ ఎస్ఐ కళ్యాణరావు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం టిఫిన్ సెంటర్‌ను ఎస్ఐ తనిఖీ చేసి హోటల్ యజమాన్యాన్ని స్టేషన్‌కు తరలించారు.
Similar News
News October 31, 2025
ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: CM

AP: ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను CM CBN ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన, ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు. NOVలో జరిగే CII సదస్సులోగా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు CMకు తెలిపారు.
News October 31, 2025
సత్యసాయి శత జయంతి: ఆరుగురు మంత్రులతో కమిటీ

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం, ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మంత్రి అనగాని సత్యప్రసాద్, సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేశ్, సవిత, ఆనం రామనారాయణ రెడ్డి నియమితులయ్యారు. కమిటీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు MLA పల్లె సింధూర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News October 31, 2025
ఆవు నెయ్యి అభిషేకంతో ఐశ్వర్య ప్రాప్తి

శివుడికి అభిషేకాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆయనకు చాలామంది అభిషేకాలు చేస్తుంటారు. అలా చేసినవారిపై ఆయన అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఆవు నెయ్యితో శివ లింగాన్ని అభిషేకించడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. శ్రేయస్సుకు, పవిత్రతకు చిహ్నంగా భావించే ఈ అభిషేకం ద్వారా అదృష్టం, సంపద కలిసివస్తాయని, ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని నమ్మకం.


