News March 30, 2025

Breaking: గద్వాల: చట్నీలో బల్లి

image

గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో బల్లి పడ్డ చట్నీ తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. పట్టణ ఎస్ఐ కళ్యాణరావు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం టిఫిన్ సెంటర్‌ను ఎస్ఐ తనిఖీ చేసి హోటల్ యజమాన్యాన్ని స్టేషన్‌కు తరలించారు.

Similar News

News April 25, 2025

షీ టీంపై పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన

image

షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు షీ టీం పని తీరుపై అవగాహన కల్పించారు. షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలో వివరించారు. అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, మహిళా వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలను ప్రజలకు వివరించారు. మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News April 25, 2025

సంగారెడ్డి: దరఖాస్తులకు రేపే చివరి తేదీ: డీఈవో

image

జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్స్‌గా పనిచేయడానికి ఆసక్తిగల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, LFL HMs, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. నిర్ణీత నమూనాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు రేపటి లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.

News April 25, 2025

ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన ప్రయాణాలు

image

పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంపై భారత విమానయాన సంస్థలు స్పందించాయి. US, UK, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రయాణించే విమానాలు ప్రత్యామ్నాయ సుదూర మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో పేర్కొన్నాయి. ట్రావెల్ టైమ్ పెరగడంతో టికెట్ల ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

error: Content is protected !!