News April 3, 2025
BREAKING.. గద్వాల: బాలుడి తల, మొండెం వేరైంది!

మల్దకల్ మండలంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని నీలిపల్లిలో తల్లిదండ్రుల వెంట ఎనిమిదేళ్ల జీవన్ వరి పొలం దగ్గరికి వెళ్లాడు. వారు వరికోత యంత్రంతో పొలంలో పనులు చేయిస్తున్నారు. బాలుడు ఆడుకుంటూ మిషన్ దగ్గరికి వెళ్లడంతో.. అది ఆ బాలుడి మీది నుంచి వెళ్లింది. దీంతో బాలుడి తల, శరీరం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

పోషణ మాస వారోత్సవాలను సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు గ్రామసభలలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు.
News September 16, 2025
అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే

ఏపీలో ఐకానిక్ <<17619158>>వంతెన<<>> నమూనాను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. 4 నమూనాలను వెబ్సైట్లో ఉంచగా అత్యధిక ఓటింగ్(14వేలకు పైగా ఓట్లు) వచ్చిన రెండో డిజైన్ను సెలక్ట్ చేశారు. రూ.2,500CR వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ వంతెన రాకతో హైదరాబాద్-అమరావతి మధ్య 35kmల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఈ నమూనాను కూచిపూడి నృత్యంలోని స్వస్తిక హస్త భంగిమ ఆధారంగా తీసుకున్నారు.
News September 16, 2025
KNR: SEPT 17న జాతీయ పతాకం ఆవిష్కరించేది వీరే..!

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను, ఛైర్మన్లను నియమించింది. JGTLలో BC కమిషన్ ఛైర్మన్ నిరంజన్, PDPLలో మైనారిటీస్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, KNRలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, SRCLలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.