News June 3, 2024
BREAKING: గోల్కొండ బోనాల జాతర తేదీల ప్రకటన

భాగ్యనగర్ శ్రీమహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు ఈరోజు మాట్లాడారు. ఈ ఏడాది HYD గోల్కొండలో ఆషాఢ మాసం బోనాల జాతరను జులై 7వ తేదీన ప్రారంభించనున్నామని తెలిపారు. ఇక పాతబస్తీలోని లాల్‌దర్వాజ సహా అన్ని ఆలయాల్లో జులై 19న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జులై 28న బోనాలు సమర్పిస్తామని చెప్పారు. 29వ తేదీన జాతర, సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. SHARE IT
Similar News
News December 3, 2025
GHMC బోర్డులు పెట్టండి: కమిషనర్

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లు, వర్క్, మెటీరియల్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.

GHMCలో పురపాలికల విలీనంపై ప్రొసీడింగ్స్

ORR వరకు 27 మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి GHMC కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. పురపాలక సంఘాల రికార్డుల పరిశీలన కోసం GHMC డిప్యూటీ కమిషనర్లు, మానిటరింగ్ ఆఫీసర్లుగా జోనల్ కమిషనర్లను నియమించారు. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పురపాలిక అకౌంటు బ్యాలెన్స్ సైతం GHMC అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేయాలని పేర్కొన్నారు.