News June 3, 2024
BREAKING: గోల్కొండ బోనాల జాతర తేదీల ప్రకటన
భాగ్యనగర్ శ్రీమహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు ఈరోజు మాట్లాడారు. ఈ ఏడాది HYD గోల్కొండలో ఆషాఢ మాసం బోనాల జాతరను జులై 7వ తేదీన ప్రారంభించనున్నామని తెలిపారు. ఇక పాతబస్తీలోని లాల్‌దర్వాజ సహా అన్ని ఆలయాల్లో జులై 19న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జులై 28న బోనాలు సమర్పిస్తామని చెప్పారు. 29వ తేదీన జాతర, సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. SHARE IT
Similar News
News September 17, 2024
దద్దరిల్లుతున్న హైదరాబాద్
వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్‌లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.
News September 17, 2024
HYD విలీనమా.. విమోచనమా.. విద్రోహమా?
‘ఆపరేషన్ పోలో’లో భాగంగా 1948-09-17న హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఇది జరిగి 76 ఏళ్లు పూర్తయినా ప్రతి ఏడాది కొత్త చర్చనే. విలీనమంటూ INC, సమైక్యత అని BRS-MIM, విమోచనమని BJP, సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, విద్రోహమని నిజాం పాలకుల మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. ఈ వ్యవహారంలో మీ మద్దతు ఏ పార్టీకి ఇస్తారు..? కామెంట్ చేయండి.
News September 16, 2024
HYD: బాలాపూర్ లడ్డూ వేలం పాటకు కొత్త రూల్
బాలాపూర్ గణపతి ఉత్సవంలో లడ్డూ వేలం వెరీ స్పెషల్. 1994లో రూ.450తో మొదలై 2023లో రూ.27 లక్షలకు పలికింది. అయితే, ఈసారి లడ్డూ వేలంపాటలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా గత సంవత్సరం పలికిన డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. బాలాపూర్ గ్రామ ప్రజలతో పాటు, ఎవరైనా ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలాపూర్ లడ్డూ వేలంపాట రేపు ఉదయం 9:30కు ప్రారంభం కానుంది.