News November 2, 2024
BREAKING: చర్లపల్లి జైలుకు ముత్యాలమ్మ గుడి నిందితుడు

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన సల్మాన్ సలీంకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేయగా ఈ ఘటనపై సిట్ 3 కేసులను నమోదు చేసింది.
Similar News
News November 9, 2025
మూసాపేటలో హైడ్రాకు మద్దతు.. ప్లకార్డులతో హర్షం

హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కబ్జాల నుంచి పార్కులను విడిపించుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని ఏళ్లుగా పోరాడామో హైడ్రా రావడంతో అవన్నీ మా సొంతం అయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కులు కాపాడి ప్రాణవాయువును అందించిన హైడ్రాకు ధన్యవాదాలంటూ ర్యాలీ నిర్వహించారు. మూసాపేటలోని ఆంజనేయ నగర్‌లో పార్కుకు చేరుకుని స్థానికులు హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు.
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్‌లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 3, 2025
రంగారెడ్డి: ప్రజావాణికి 25 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, DRO సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఈ రోజు ఉదయం RR జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రజావాణికి 25 ఫిర్యాదులు రాగా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు.


